MLG: మంగపేట మండలం బోర్ నర్సాపూర్ నుంచి గోదావరి ఫెర్రీ పాయింట్ వరకు రూ.2 కోట్లతో నిర్మించనున్న రోడ్డుకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్ & బి రోడ్డు నుంచి ఫెర్రీ పాయింట్ వరకు పనులు చేపట్టనున్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ మహేందర్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.