SRPT: హుజూర్ నగర్ మండలం గోపాలపురంలో బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు హుజూర్ నగర్ మండల వైద్యాధికారి డా. వేణుగోపాల్ నాయక్ తెలిపారు. నేడు గోపాలపురంలో టీకాల కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ టీకా గర్భాశయ ముఖ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఆయన అన్నారు.