TG: రాష్ట్రంలో రాజ్యసభ అభ్యర్థులపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీ వెళ్లాల్సిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన వాయిదా పడింది. తెలంగాణలో 2 రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్టానంతో చర్చించేందుకు ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు లేకపోకపోవడంతో మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయింది.