KMM: మధిర మున్సిపాలిటీ మడుపల్లి ప్రధాన రహదారిపై డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుకున్నట్లు బుధవారం వెల్లడించారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై మురుగునీరు చేరడంతో దుర్వాసన వెదజల్లుతోంది. వాహనాలు జారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.