కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో గల అడవి లింగాల గ్రామంలోని SC వార్డులో రూ.5లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. గ్రామ అభివృద్ధికి మరిన్ని పనులు చేపడతామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, సెక్రటరీ శంకరయ్య పాల్గొన్నారు.