ATP: గుంతకల్లు సీపీఎం కార్యాలయంలో వెనుజులాపై అమెరికా ఉగ్రవాది సామ్రాజ్యవాద దురాక్రమణ దారితనానికి వ్యతిరేకంగా సీపీఎం నాయకులు ఇవాళ కరపత్రాలను ఆవిష్కరించారు. పట్టణంలో ఈ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. అమెరికా సామ్రాజ్యవాదం వెనిజులాపై సాగిస్తున్న దురాక్రమణ చర్యలను వెంటనే నిలిపివేయాలన్నారు.