BPT: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం వేటపాలెం మండలం రామన్నపేటలో ఆయన విగ్రహానికి చీరాల ఎమ్మెల్యే కొండయ్య పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో విశేష ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.