ప్రకాశం: పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని టీడీపీ పుల్లలచెరువు మండల కన్వీనర్ పోట్ల గోవింద్ అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఐటీవరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ముటుకుల సొసైటీ ఛైర్మన్ పావులూరి యోగి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.