NLR: జిల్లాలో పొగ మంచు ఎక్కువైన నేపథ్యంలో వాహనదారులకు ఎస్పీ డా. అజిత వేజెండ్ల పలు సూచనలు చేశారు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగించాలన్నారు. వాహనాల మధ్య దూరం పాటించాలని కోరారు. హజార్డ్ లైట్స్ ఆన్ చేయడంతో పాటు, డి ఫాగర్ ఆన్‌లో ఉంచాలన్నారు. ఈ నియమాలను పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.