GDWL: అలంపూర్ పురపాలక పట్టణంలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నూతన ఓటర్ లిస్టు ప్రకారం మహిళలు 4,940, పురుషులు 4,681, ఇతరులు 1 ఉన్నారు. పుర ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలంటే నారీమణుల ఓట్లే కీలకం కానున్నాయి. శుక్రవారం రిజర్వేషన్లు రావడంతో పురపాలక పట్టణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార, ప్రతిపక్ష రెండు పార్టీల మధ్య ఈసారి పోరు హోరాహోరిగా సాగనుంది.