విశాఖపట్నం రామ్‌నగర్‌లో ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడీపీ నాయకులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని నేతలు పిలుపునిచ్చారు. ఇందులో ఎంపీ శ్రీ భారత్ పాల్గొన్నారు.