మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘మెగా-158’ సినిమా రాబోతుంది. ఈ మూవీ జనవరి 25న అధికారికంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని, కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇక KVN ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు AR రెహమాన్ మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం.