TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు గుప్పించారు. BRSను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని అన్నారు. అందుకే కాంగ్రెస్, BJP నేతలు ఒకరిపై ఒకరు పొగడ్తలు చేసుకుంటున్నారని తెలిపారు. ఒక మంత్రిని దించేందుకు మరో మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల తీరుతో రాష్ట్ర పరువుపోతోందని మండిపడ్డారు.