చలికాలంలో పాదాలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. కొద్దిగా ఓట్స్ తీసుకుని అందులో రోజ్ వాటర్ కలిపి మిశ్రమంలా చేసుకుని కాళ్లు, పాదాలపై అప్లై చేసి మర్దన చేయాలి. 30 నిమిషాల తర్వాత నీళ్లతో కడగాలి. పాదాలకు ఆరాకా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా వారానికి 3-5 సార్లు చేస్తే పాదాలు పొడిబారవు.