AP: వైసీపీ నేతల తీరుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్ అయ్యారు. ‘అధికారం పోయినా జగన్ అనుచరుల తీరు మారడం లేదు. సంక్రాంతి పండుగ ప్రశాంతతను దెబ్బతీయాలని చూశారు. బడుగు-బలహీన వర్గాలపై దాడులకు తెగబడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో హత్యా రాజకీయాలకు తావు లేదు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు’ అని పేర్కొన్నారు.