TPT: అలిపిరి వద్ద జింకపై చిరుత దాడి చేసి చంపింది. ద్విచక్ర వాహనాల పార్కింగ్ ప్రాంతంలో వేకువ జామున 3.30 గంటల సమయంలో ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, జింక కళేబరాన్ని పశువైద్యశాలకు తరలించి ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. చిరుత సంచారంతో అలిపిరి నడక మార్గంలో భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.