AP: SIPB ఆమోదం మేరకు విశాఖకు పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. అందులో భాగంగా 1,38,000 ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. ఇటీవల జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా మరో రూ.99 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దీంతో 2 లక్షల ఉద్యోగాలు లభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.