VKB: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ర్యాలీలు, నిరసనలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మైపాల్ కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మార్పు చేస్తూ పేదల పొట్ట కొడుతుందన్నారు.