AP: రాష్ట్ర ఆరోగ్య శాఖలో ‘అవేర్'(AWARE) సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ సేవలను RTGSతో అనుసంధానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చారిత్రక డేటా ఆధారంగా వ్యాధుల తీవ్రత, ప్రాంతాలను గుర్తించి, త్వరగా ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.