హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో ఆదివారం మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సమస్యలపై పోరాడుతూ అనునిత్యం ప్రజల మధ్యలో ఉండాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ, గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని అన్నారు.