E.G: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి ఆదివారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఒక ఉత్తమ నాయకుడు జన్మిస్తే ఆ వంశానికే కాక మొత్తం జాతికే గుర్తింపు వస్తుందని కొనియాడారు. ఉన్నత విలువలు కలిగిన ఎన్టీఆర్ వల్ల తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తండ్రి ఎన్టీఆర్ ఫోటోను ఎంపీ షేర్ చేశారు.