SDPT: చేర్యాల మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా మారింది. గతంలో బీఆర్ఎస్కు చోటు దక్కగా, ఈసారి ఎలాగైనా జెండా పాతాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అటు బీజేపీ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 13,777 మంది ఓటర్లలో 7,119 మంది మహిళలే ఉండటంతో గెలుపోటములను వారే శాసించనున్నారు. మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి.