KRNL: పత్తికొండ మండలం హోసూరులోని MPP పాఠశాలలో సంక్రాంతి సెలవుల్లో గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల గేటు, తరగతి గది తాళాలు పగలగొట్టి లోనికి చొరబడి పుస్తకాలను చిందరవందరగా చేసి ధ్వంసం చేశారు. అలాగే మద్యం తాగి ఖాళీ సీసాలు, వాటర్ ప్యాకెట్లను పాఠశాల ఆవరణలో పడేశారు. దీనిపై మాజీ విద్యా కమిటీ ఛైర్మన్ బ్రహ్మయ్య, ప్రజలు బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు.