కోనసీమ: ప్రైవేట్ ట్రావెల్ బస్సుపై రవాణా శాఖ అధికారులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. అమలాపురంలో ఓ బస్సు వెనుక అద్దం లేకపోయినా అట్టముక్క తగిలించి నడుపుతున్న బస్సును గుర్తించి నిబంధనలకు అతిక్రమించినందుకు బస్సు యజమానికి రూ.10,600 వేల జరిమానా విధించినట్లు డీటీవో శ్రీనివాసరావు తెలిపారు. ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.