BPT: బాపట్ల ఏరియా వైద్యశాలలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ వినోద్ కుమార్ను కలిసి సమస్యను వివరించారు. ఆసుపత్రిలో క్యాంటీన్ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పాలు, అల్పాహారం దొరకడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.