న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు తేలిపోతున్నారు. గ్లెన్ ఫిలిప్స్ కూడా 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ప్రస్తుతం 42 ఓవర్లకు కివీస్ స్కోర్ 266/3గా ఉంది. డారిల్ మిచెల్ (128), ఫిలిప్స్ (101) భాగస్వామ్యం విడగొట్టేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.