కృష్ణా: చల్లపల్లిలో ఆదివారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లముల వైద్య శిబిరం నిర్వహించారు. నేత్ర వైద్యులు 50 మందికి పరీక్షలు నిర్వహించి 12 మందికి కంటికి శుక్లముల ఆపరేషన్ అవసరమైనట్లు గుర్తించారు. వారికి సోమవారం విజయవాడలో ఆపరేషన్లకు ఏర్పాటు చేశారు. గోళ్ళ సాంబశివరావు, ఉరిమి రమేష్, సువర్చల, దింటకుర్తి జ్యోతి, వరదా హరిగోపాల్, నంబూరి కుసుమ పాల్గొన్నారు.