VZM: సినీ రంగంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలను పొందిన స్వర్గీయ NTR రాజకీయ రంగంలో CMగా పేదలకు చేసిన సేవలు మరపురానివి అని బొబ్బిలి YCP మాజీ ఎమ్మెల్యే శంబంగి వేంకట చిన అప్పలనాయుడు కొనియాడారు. ఆదివారం పక్కిగ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.