SRD: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ చట్టాలు వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. కార్మిక కర్షక పాదయాత్ర ఆదివారం జోగిపేట పట్టణానికి చేరుకుంది. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని చెప్పారు.