కోనసీమ: ఆలమూరు మండలం చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయానికి రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన సత్తి వీర రాఘవరెడ్డి దంపతులు రూ. 1,01,116లు విరాళం అందజేశారు. ఇటీవల కాలంలో ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నిమిత్తం ఆలయ అభివృద్ధిలో తన వంతు భాగంగా ఈ విరాళాన్ని వీర రాఘవరెడ్డి దంపతులు ఆదివారం ఆలయ ఈవో వీర్రాజు చౌదరికి అందజేశారు.