SRCL: కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మరో భద్రాద్రిగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మాఘ అమావాస్య రోజున జాతర నిర్వహిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చారు.