కృష్ణా: కంకిపాడు మండలంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం ఆదివారం టీడీపీ నాయకులు నిర్వహించారు. కంకిపాడులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను నాయకులు కొనియాడారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.