WGL: రైలు ప్రయాణికుల రక్షణ, నేరాల అదుపుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చందన దీప్తి ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ రైల్వే పోలీస్ స్టేషన్ను ఇవాళ ఆమె సందర్శించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ప్రయాణికులకు భద్రతా భావం కల్పించాలని, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని SP ఆదేశించారు.