GNTR: గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు 0863-2345103, 9849908391 కాల్ సెంటర్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.