RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీలో రూ.22 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు పనులను కార్పోరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పరిశీలించారు. రోడ్డు క్యూరింగ్ సరిగా చేయడం లేదని కాలనీవాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. క్యూరింగ్ సరిగ్గా చేయాలని కాలనీవాసులకు ఇబ్బందులు కలవకుండా చూడాలని, రోడ్డు నిర్మాణ సమయంలో దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.