ASF: రెబ్బెన మండలం ఇంద్రానగర్ సమీపంలో రైలు పట్టాలపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 ఏళ్ళు ఉంటుందని, తెల్లని షర్ట్, నీలి జీన్స్ ధరించి, మెడలో తాయత్తు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలిస్తే తమను సంప్రదించాలన్నారు.