MBNR: జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర కాలనీ, మర్లు, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో గురువారం మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సాంకేతిక కారణాల దృష్ట్యా సరఫరా నిలిపివేస్తున్నట్లు లైన్మెన్ మాధవరెడ్డి తెలిపారు. కాలనీ ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి శుక్రవారం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.