SRPT: కోదాడ పట్టణానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఇమ్రాన్ బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.