BHNG: గ్రామ అభివృద్ధిలో యువత, ఉద్యోగులు, పంచాయతీ పాలకవర్గానికి సహకరించాలని రామన్నపేట మండలం నీర్నేముల గ్రామ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వర్ రెడ్డి అన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఇవాళ సర్పంచు కందిమల్ల గోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ ఆవుల శ్రీశైలం, వార్డు సభ్యులను సన్మానించారు. ఇటీవల ఉద్యోగాలు పొందిన, ఉన్నత విద్య పూర్తి చేసిన వారిని కూడా సత్కరించారు.