MLG: రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నేడు చొల్లంగి అమావాస్య అయినా మేడారంలో నిర్వహించడం వెనుక మతలబు ఏంటని సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమావాస్య రోజున నరదృష్టి తీసుకోవడానికి నాలుగు బాటల దగ్గర నిమ్మకాయ, గుడ్డు దాటుడు చేస్తారని, అడవిలో మంత్రుల సమావేశం జరగడం వెనుక ఏదో లక్ష్యం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.