ADB: ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి పాత సమయానికే ప్రారంభమవుతాయి. గత నెలలో చలి తీవ్రత దృష్ట్యా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు ఉదయం 9:40 గంటలకు తరగతులు ప్రారంభమయ్యేవి. ప్రస్తుతం ఎండలు ముదరడం, చలి తగ్గడంతో తిరిగి ఉదయం 9 గంటలకే బడులు తెరవాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.