NTR: బార్లు, మద్యం షాపులు, రెస్టారెంట్లు ప్రభుత్వ నిబంధనలు, సమయపాలన పాటించాలి అని నార్త్ ఏసీపీ స్రవంతి రాయ్ తెలిపారు. ఆదివారం ఆమె సత్య నారాయణపురం పోలీసు స్టేషన్లో బార్ రెస్టారెంట్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. బార్ల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. బార్లు వద్ద గొడవలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందిచాలని తెలిపారు.