KMR: తాడ్వాయి మండలం సంతాయిపేట అటవీ ప్రాంతంలోని భీమేశ్వర ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కామారెడ్డి జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన భీమేశ్వర ఆలయానికి మాఘ అమావాస్య సందర్భంగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, తాడ్వాయి ఎస్సై నరేష్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భీమేశ్వర వాగులో పవిత్ర స్నానాలు ఆచరించారు.