విశాఖ పోర్టు మరో చారిత్రక ఘనత సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 289 రోజుల్లోనే 70 మిలియన్ టన్నుల సరకు రవాణా పూర్తి చేసింది. 2026 జనవరి 14 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంది. పోర్టు 92 ఏళ్ల చరిత్రలో ఇంత తక్కువ సమయంలో భారీ రవాణా ఇదే తొలిసారి. గతంలో 2024–25లో 316 రోజులు, 2023–24లో 320 రోజులు పట్టింది.