U19 ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 238 పరుగులు చేసింది. అయితే, వర్షం కారణంగా అంపైర్లు DLS పద్ధతిలో బంగ్లా లక్ష్యాన్ని 29 ఓవర్లలో 165 పరుగులుగా కుదించారు. ఈ క్రమంలో బంగ్లా 28.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. భారత బౌలర్లలో విహాన్ 4, ఖిలాన్ 2 వికెట్లు పడగొట్టారు.