ADB: నార్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ప్రధాన రహదారి వీధిదీపాలు 5 నెలల నుంచి వెలగడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం సర్పంచ్ బానోత్ కావేరి వీధిదీపాలు మరమ్మతులు చేపట్టారు. రాత్రి సమయాల్లో అంధకారంలో ఉన్న రాకపోకలకు వెలుగు చూపడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరలో పారిశుధ్య పనులు చేపట్టి అభివృద్ధిపై దృష్టి సారిస్తామన్నారు.