TG: HYDకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.2.9 కోట్లు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్లో 300 శాతం లాభాలంటూ నమ్మించి ఓ నకిలీ యాప్ డౌన్లోడ్ చేయించారు. తొలుత రూ.50 వేల లాభం చూపించి నమ్మకం కలిగించారు. దీంతో ఆయన విడతల వారీగా రూ.2.9 కోట్లు పెట్టుబడి పెట్టాడు. రూ.3.47 కోట్ల బ్యాలెన్స్ కనిపిస్తున్నా, విత్డ్రా కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.