MLG: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా శాంతి భద్రతల ఏర్పాట్ల పై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు. మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను SP సుధీర్ రామ్నాథ్ కేకన్ తో కలిసి సందర్శించి.. భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. భద్రతలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రతి చిన్న అంశాన్ని అప్రమత్తంగా పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.