అన్నమయ్య: మదనపల్లె నియోజకవర్గంలోని మండలాలకు అధ్యక్షులను సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నియమించామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో కొత్త అధ్యక్షులను సన్మానిస్తూ, రాబోయే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు అందరం కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపును సీఎంకు కానుకగా అందిద్దామని తెలిపారు.