పార్వతీపురం మండలం జిమ్మిడివలస గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు. ఈ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపును తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.